Wednesday, February 4, 2026
E-PAPER
Homeసినిమా'సుమతి శతకం'కి రవితేజ ప్రశంసలు

‘సుమతి శతకం’కి రవితేజ ప్రశంసలు

- Advertisement -

సాయి సుధాకర్‌ కొమ్మాలపాటి నిర్మాణంలో విజన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎంఎం నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సుమతి శతకం’.
అమర్దీప్‌ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. సీరియల్స్‌, బిగ్‌బాస్‌ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరిగా అందరికీ పరిచయమైన అమర్దీప్‌ రవితేజ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్‌ చూసిన రవితేజ స్పందిస్తూ… ”అమర్దీప్‌, నీ సినిమా సుమతీ శతకం చిత్ర టీజర్‌, ట్రైలర్‌ ఇంకా ఇతర కంటెంట్‌ చూడడం జరిగింది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. జీరో కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్‌, సెన్సార్‌ బోర్డు నుండి ప్రశంసలు రావడం మరొక ప్రత్యేకమైన విషయం. చాలా రోజులు తరువాత ఫీల్‌ గుడ్‌ సినిమాను చూస్తున్నామని సెన్సార్‌ అభిప్రాయపడింది. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లోని నార్త్‌ అమెరికాలో వైబ్రంట్‌ సినిమాస్‌, అమెరికాలోని డల్లాస్‌లో రవి కొల్లిపార, జై పాకాల విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -