Wednesday, February 4, 2026
E-PAPER
Homeఆటలునేడు సఫారీతో ప్రాక్టీస్‌

నేడు సఫారీతో ప్రాక్టీస్‌

- Advertisement -

ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు షురూ కాగా.. భారత్‌ ఏకైక వార్మప్‌ మ్యాచ్‌ నేడు ఆడనుంది. ముంబయిలోని డివై పాటిల్‌ స్టేడియంలో గత ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. దక్షిణాఫ్రికా శిబిరంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ లేకపోవటం ఆ జట్టుకు అతిపెద్ద ప్రతికూలత. అయినా, ఎడెన్‌ మార్‌క్రామ్‌ సారథ్యంలో సఫారీలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. క్వింటన్‌ డికాక్‌, మార్కో యాన్సెన్‌, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, జేసన్‌ స్మిత్‌, రియాన్‌ రికెల్టన్‌లు సఫారీలకు కీలకం. డిఫెండింగ్‌ చాంపియన్‌తో వార్మప్‌తో తుది జట్టుపై ఓ అంచనాకు రావాలనే ఆలోచనలో దక్షిణాఫ్రికా ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో దుమ్మురేపిన భారత్‌.. నేడు ప్రధానంగా తిలక్‌ వర్మ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టనుంది. ఆసియా కప్‌ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌ వర్మ భారత బ్యాటింగ్‌ లైనప్‌లో కీలకం. భారత్‌-ఏ తరఫున యుఎస్‌ఏపై ఓ వార్మప్‌ ఆడినా.. మంగళవారం జట్టుతో చేరిన తిలక్‌ వర్మ నేడు వార్మప్‌లో ఆడనున్నాడు. సంజు శాంసన్‌కు సైతం ఈ వార్మప్‌ మ్యాచ్‌ కీలకం కానుంది. కివీస్‌తో సిరీస్‌లో విఫలమైన సంజు శాంసన్‌కు వార్మప్‌ రూపంలో మరో అవకాశం దక్కినట్టే. భారత్‌, దక్షిణాఫ్రికా వార్మప్‌ మ్యాచ్‌ నేడు రాత్రి 7 గంటలకు ఆరంభం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -