Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయం'పీఎం మోడీ సరెండర్‌'

‘పీఎం మోడీ సరెండర్‌’

- Advertisement -

ఆర్మీ మాజీ చీఫ్‌ రాసిన పుస్తకంలోని
– అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షనేతల ఆందోళన
– ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌
– బడ్జెట్‌ సెషన్‌ ముగిసే వరకు నో ఎంట్రీ : దిలీప్‌ సైకియా వెల్లడి..రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్‌

– భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌ గుట్టు విప్పాలని నినాదాలు
– ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌
– రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌, భారత్‌-చైనా సంబం ధాల సమస్యలపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌ వాది పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్‌ చేశారు. ‘పీఎం మోడీ సరెండర్‌’ అంటూ ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో సభ హోరెత్తింది. ప్రతిపక్ష సభ్యు లంతా స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులు పట్టు కుని నినాదాలు చేశారు. దీంతోపాటు భారత్‌-చైనా ఉద్రి క్తతలకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్‌ పుస్తకంలో వెల్లడైన అంశాలపై చర్చకు అనుమతించని కేంద్ర ప్రభుత్వ చర్యపై ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ ఎని మిది మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. అందులో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు గుర్జిత్‌ సింగ్‌ ఓజ్లా, సి. కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మాణికం ఠాగూర్‌, అమరీందర్‌ సింగ్‌ రాజా, ప్రశాంత్‌ పడోలే, డీన్‌ కురియాకోస్‌, హిబి ఉడాన్‌తో పాటు సీపీఐ(ఎం)కు చెందిన ఎస్‌. వెంకటేశన్‌ ఉన్నారు. మాజీ ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే రాసిన ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకంలోని వెల్లడైన అంశాలపై చర్చకు అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే, ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పుస్తకంలోని ఇంకా ప్రచురించబడని భాగాలను సభలో చర్చించడానికి అనుమతించబోమనడం కేంద్ర ప్రభుత్వ వైఖరి కాగా, ప్రచురణకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం పుస్తకాన్ని నిలుపుదల చేస్తోందని ప్రతిపక్షం ఎత్తి చూపింది. ఈ బలమైన వాదనలు తీవ్ర గందరగోళంగా మారడంతో సభా కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

లోక్‌సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. మరోవైపు ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు సైతం నిరసన తెలిపారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిం చారు. ఏపీలో ప్రతిపక్ష సభ్యులకు భద్రత లేకుండా పోయిం దన్నారు. ఇందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన జవాబు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. ఆపై ప్రారం భమైన సభలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. దీంతో కాసే పటికే తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో మాజీ ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తా వించేందుకు రాహుల్‌గాంధీకి అనుమతి నిరాకరించడంతో సభలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రతిపక్షసభ్యుల నిరసనలు, నినాదాలతో సభ హోరెత్తింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీలు కాగితాలు చింపి స్పీకర్‌ పోడియం వైపు విసిరారు. మరికొందరు తమ కుర్చీలు ఎక్కి నిరసన తెలిపారు. దీంతో సభ మధ్యాహ్నం 3గంటలకు వాయిదా పడింది.
తిరిగి సభ ప్రారంభం కాగానే… సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్‌ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సెషన్‌ ముగిసే వరకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. సభా మర్యాదలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఎనిమిది మంది ఎంపీలను ప్రస్తుత సెషన్‌ ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ చైర్‌లో ఉన్న దిలీప్‌ సైకియా ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సస్పెండ్‌ అయిన ఎంపీలు పార్లమెంట్‌ గేటు వద్ద ఆందోళనకు దిగారు. వీరికి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, చర్చకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్లతో భయపెట్టాలని చూస్తోందని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్‌
ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చించా లని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు సభను వాకౌట్‌ చేశాయి. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ఇండియా-యూఎస్‌ వాణిజ్య ఒప్పం దం అంశాన్ని లేవనెత్తారు. ఒప్పందం గురించి సమాచారం వాషింగ్టన్‌ నుంచి వెలువడుతోందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభా నాయుకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ఇండియా వస్తువు లపై సుంకాల తగ్గింపుపై సోషల్‌ మీడియాలో అమెరికా అధ్యక్షుడు పోస్టు చేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మాట్లాడినట్టు తెలిపారని అన్నారు. ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని విమర్శిస్తూ ప్రతి పక్షసభ్యులు నినాదాలు హోరెత్తించారు. దీంతో చైర్మెన్‌ సీపీ రాధాకృష్ణన్‌ జోక్యం చేసుకుని ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షసభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారన్నా రు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
మరోపక్క ట్రంప్‌ హయాంలో అమెరికన్‌ సుంకాలను తగ్గించిన మోడీని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సత్కరించింది. 2020 ఆగస్టులో భారత్‌-చైనా సరిహద్దు వివాదం చెలరేగినప్పుడు ప్రధానమంత్రి, రక్షణ మంత్రి కీలకమైన నిర్ణయాలను ఆలస్యం చేశారనే ఆరోపణలు ఎం.ఎం. నరవణే పుస్తకంలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -