Monday, May 26, 2025
Homeసినిమాఅందరినీ మెప్పించే 'యుఫోరియా'

అందరినీ మెప్పించే ‘యుఫోరియా’

- Advertisement -

గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతో గుణశేఖర్‌ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్‌, నాసర్‌, రోహిత్‌, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పధ్వీరాజ్‌, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్‌, ఆదర్శ్‌ బాలకష్ణ, రవి ప్రకాష్‌, నవీనా రెడ్డి, లికిత్‌ నాయుడు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. శనివారం ఈ చిత్రం నుంచి ‘ఫ్లై హై’ అంటూ ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎంబీలోని శరత్‌ సిటీ మాల్‌లో సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
‘ఫ్లై హై’ అంటూ సాగే ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. కాళ భైరవ అందించిన బాణీ ట్రెండీగా ఉంది. ఇక ఈ పాటను కాళ భైరవ, పథ్వీ చంద్ర, గాయత్రి నటరాజన్‌ ఆలపించారు. ఈ పాట పిక్చరైజేషన్‌ చూస్తుంటే నేటి యూత్‌, మత్తులో మునగడం, నైట్‌ అవుట్స్‌, ఫ్రెండ్స్‌తో చిల్‌ అవ్వడం వంటి అంశాలను చూపించారు. యూత్‌కు ఇన్‌స్టంట్‌ కిక్‌ ఇచ్చేలా ఈ పాటను గుణ శేఖర్‌ పిక్చరైజ్‌ చేసినట్టు కనిపిస్తోంది. సాంగ్‌ లాంచ్‌ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణ శేఖర్‌ మాట్లాడుతూ, ‘ఆడియెన్స్‌ చూపించే ఎనర్జీయే ‘యుఫోరియా’. ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. ఈ ‘ఫ్లై హై’లానే ఇంకో మూడు పాటలు ఉంటాయి. అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కాళ భైరవ అద్భుతమైన పాటలు ఇచ్చారు. కంప్లీట్‌ యూత్‌ ఫుల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో ఈ మూవీని తీస్తున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -