– దేవిదాస్ పటేల్
నవతెలంగాణ- మద్నూర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గెలుపు కోసం ఆ గ్రామ పెద్దలు బీఆర్‌ఎస్ నాయకులు దేవిదాస్ పటేల్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో కేసీఆర్ ఆయంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందించే కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్ అభ్యర్థి హనుమంతు షిండే ను గెలిపించాలని పటేల్ ఇంటింట ప్రచారంలో గ్రామస్తులను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రకాష్ పటేల్ అప్ప రావు పటేల్ లక్ష్మణ్ మాధవ్ అప్పారావు శివాజీ పటేల్ దత్తు పటేల్ పండరి తదితరులు పాల్గొన్నారు.