Monday, May 26, 2025
Homeసినిమాఆ విషయంలో తప్పు మాదే

ఆ విషయంలో తప్పు మాదే

- Advertisement -

‘ఆ నలుగురు.. అంటూ రెండు రోజుల నుంచి వార్తలొచ్చాయి. వారి కబంధ హస్తాల్లోనే ఇండిస్టీ ఉన్నట్టు చిత్రీకరించారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్‌ ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కోవిడ్‌ సమయంలో ఆ నలుగురి వ్యాపారం నుంచి నేను బయటకు వచ్చేశా. తెలంగాణాలో నాకు కేవలం ఒకే ఒక థియేటర్‌ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 థియేటర్లు ఉంటే నాకు 15లోపే ఉన్నాయి. లీజు పూర్తయ్యాక వాటిని కూడా రెన్యువల్‌ చేయవద్దని మా వాళ్ళకి చెప్పాను. కాబట్టి త్వరలో అవి కూడా ఉండవు. అయితే గత రెండు రోజులుగా ఆ నలుగురు..అంటూ నన్ను కూడా చేర్చి మరీ వార్తలు రాస్తున్నారు. ఆ నలుగురులో నేను లేను అని స్పష్టం చేస్తున్నా. సినిమాలు నిర్మించడమే 50 ఏళ్ళుగా నా వృత్తి. జూన్‌ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ స్పందన సమంజసమైంది. తాజా పరిణామాలపై ఫిల్మ్‌ఛాంబర్‌లో జరుగుతున్న ఏ సమావేశానికీ నేను వెళ్ళలేదు. అలాగే మా గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌నీ వెళ్ళొద్దని చెప్పా. అయితే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కష్టాల్లో ఉన్నాయి. వీటి సమస్యల పరిష్కారానికి థియేటర్ల యాజమానులు ఫిల్మ్‌ఛాంబర్‌, ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ని సంప్రదించాలి.
ఇదిలా ఉంటే, పవన్‌కళ్యాణ్‌ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసేస్తామని అనటం కచ్చితంగా దుస్సాహసమే. మన ఇండిస్టీ నుంచి వెళ్ళి పోరాడుతున్న వ్యక్తి ఆయన. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఓసారి అందరూ సీఎం చంద్రబాబునాయుడుని కలవమని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. కానీ ఛాంబర్‌ వాళ్ళతో సహా ఎవరూ వెళ్ళి కలవలేదు. ఆ విషయంలో తప్పు మాదే’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -