- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో జరిగే తిరుగువారం పండుగకు వెళ్తుండగా.. భక్తులతో కూడిన బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామస్తులుగా గుర్తించారు.
- Advertisement -



