Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెచ్చిపోతున్న లిక్కర్ మాఫియా 

రెచ్చిపోతున్న లిక్కర్ మాఫియా 

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండలంలో వైన్ షాప్ ల పనితీరు ఇష్టా రాజ్యాంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమయపాలన లేకుండా మధ్యాహ్నం 12 గంటలకు షాప్ తీసి బెల్ట్ షాపులకు ఒక బాటిల్ పై 20రూ నుండి 40రూ వరకు అధిక రేట్లు కు అమ్ముకొని మూడు, నాలుగు గంటలకు బంద్ చేసుకుని వెళ్ళిపోతున్నారని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని అసలు వైన్ షాప్ ఉన్నది రిటైల్ గా అమ్మడానిక ?లేదంటే బెల్ట్ షాప్ ల వరకే పరిమితమా !అని మండలం లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నేరడ్ల  అశోక్ మాట్లాడుతూ.. ఈ మండలంలో ఉండేవాళ్లు చిన్నా సన్న కారు రైతులు కాబట్టి పొలం పనిలోకి వెళ్లి వచ్చి సాయంత్రానికి 90ml  లేదా కోటరు తాగాలని వెళ్తే వైన్ షాప్ బందు ఉండడంతో బెల్ట్ షాపులలో కోటరుకు 40 రూపాయలు ఎక్కువ చెల్లించి తాగాల్సి వస్తుందని వాపోతున్నారు,కన్నాయిగూడెం మండలం లో  లిక్కర్ మాఫియా అనుసరిస్తున్న విధానాల పట్ల   ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -