- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్‌లో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 160 స్టాల్స్ ఏర్పాటు చేసి భారతీయ పాకశాస్త్ర గొప్పతనాన్ని ప్రతిబింబించే వివిధ వంటకాలను ప్రదర్శించారు. రైతులు పండించిన పంటలతో తయారైన ఆహారాన్ని విద్యార్థులు స్వయంగా సిద్ధం చేసి పాల్గొనడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రైతులు పంట పండించడానికి పడే శ్రమను గుర్తించి ఆహారాన్ని వృథా చేయకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శంకర్, గీరెడ్డి రాజిరెడ్డి, భువనగిరి గోపాలకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



