2వ మరియు 3వ శ్రేణి పట్టణాలుAmazon.inకు 60% కొత్త కస్టమర్లను అందిస్తున్నాయి
గత ఏడాదితో పోలిస్తే ప్రైమ్ కస్టమర్ల అదే-రోజు డెలివరీ ఆర్డర్ల సంఖ్య 2.5రెట్లు పెరిగింది
– మెట్రోలు, మరియు 2వ శ్రేణి పట్టణాల్లోని కస్టమర్లు ఫీచర్లు పుష్కలంగా ఉన్న స్మార్ట్ ఫోన్లకు, గృహోపకరణాలకు మరియు ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్లకు అప్‌గ్రేడ్ అవుతుండటంతో, ప్రీమియమైజేషన్ ఒక ప్రముఖ ట్రెండుగా ఆవిర్భవించింది
– పెళ్ళిళ్ళ సీజన్, కొత్త సంవత్సరం వార్డ్రోబ్ను నవీకరించుకుంటున్ననేపథ్యంలో, విలువైన నగలు, ఉత్తమమైన దుస్తులు మరియు సౌందర్య బ్రాండ్లలో కస్టమర్లు పెట్టుబడి పెట్టటంతో, ఫ్యాషన్ మరియు సౌందర్య విభాగాల్లో విపరీతమైన డిమాండును పెంచింది.
– ఆరోగ్యం మరియు సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్న కారణంగా, శుభ్రతను కలిగించే పదార్ధాలు, అధిక-ప్రోటీన్ ప్రత్యామ్నాయాలు మరియు ప్రీమియం ప్రత్యామ్నాయాల దైనందిన వాడకం బాగా పెరిగింది
– పర్యావరణానుకూలమైన ఉపకరణాలు,సాంప్రదాయేతర ఇంధన వనరుల సొల్యూషన్లు మరియు అప్‌గ్రేడ్ ఆప్షన్లను కస్టమర్లు ఎంచుకుంటున్న తరుణంలో, సుస్థిరమైన ఛాయిస్‌లకు ఆదరణ పెరుగుతోంది అమెజాన్ బజార్లో తక్కువ ధర శ్రేణి లభ్యత మొదటిసారి కొనుగోలు జరుపుతున్న కస్టమర్లను, అమెజాన్ బిజినెస్ ద్వారా బిజినెస్ అప్‌గ్రేడెడ్ ఆప్షన్లను ఆకర్షిస్తోంది, అమెజాన్ పేలో ప్రయాణాల కోసం బుకింగులు బాగా పెరిగాయి.
నవతెలంగాణ – బెంగుళూరు: కంపెనీ వారి మొదటి పెద్ద షాపింగ్ ఈవెంట్ – ద గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో కస్టమర్లు పెద్ద ఎత్తున పాల్గొనటం, భారీగా డిమాండ్ కనిపించిందని అమెజాన్ ఇండియా ఈ రోజు రిపోర్ట్ చేసింది. కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులకు అప్‌గ్రేడ్ అయ్యారు, ఆరోగ్యవంతమైన జీవనశైలులను అవలంబించారు, ఆశయాలు మరుయ అవసరాలకు కావలసిన సామాగ్రుల కోసం కూడా కస్టమర్లు కొనుగోళ్ళు చేశారు. ఇందుకు విస్తృతశ్రేణి ఉత్పత్తులు, వేగవంతమైన డెలివరీ, నిరాఘాటమైన అనుభవం దోహదం చేశాయి. ప్రైమ్ డే కస్టమర్లు అదే-రోజు డెలివరీ కోసం చేసిన ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 2.5 రెట్లు పెరిగాయి.
“ద అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పలు కీలకమైన ట్రెండ్లను పటిష్టం చేసింది. అందులో, మొదటిసారి కస్టమర్లు అయినవారు – ప్రత్యేకించి 2వ మరియు 3వ శ్రేణి పట్టణాలకు చెందినవారు – బలంగా పాల్గొనటం. స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ మరియు సౌందర్యసాధనాల శ్రేణుల వ్యాప్తంగా ప్రీమియమైజేషన్ వైపుకు మ్రొగ్గు స్పష్టంగా కొనసాగటం మాకు కనిపించింది. కస్టమర్లు ఎఐ సుసజ్జితమైన ఫీచర్లను ఉపయోగించి, విషయాలను తెలుసుకుని తమకు కావలసిన ఉత్పత్తులను నిర్ణయించుకునే వైఖరి పెరిగింది. కాగా ప్రైమ్ మెంబర్లు, సేల్ సందర్భంగా, అదనంగా సొమ్మును ఆదా చేసుకుని, త్వరగా డెలివరీల సేవలను పొంది ఆనందించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలుల పై ప్రత్యేకమైన శ్రద్ధ పెరుగుతుండటం కూడా మాకు కనిపిస్తూ వచ్చింది. ఎంపిక చేసుకునేందుకు, స్పీడ్, సౌకర్యం, విలువల విషయంలో అమెజాన్ ఇండియా పై కస్టమర్లు పెట్టుకునే నమ్మకం ఇప్పటికీ పునాదిగా నిలిచే ఉంది. మేము ఈ వేగాన్ని పునాదిగా ఆధారం చేసుకుని కస్టమర్లకు, విక్రేతలకు, భాగస్వాములకు, సంవత్సరం అంతా మెరుగైన అనుభవాలను అందించేందుకు ముందుకు సాగుతాము,” అని సౌరభ్ శ్రీవాస్తవ, వైస్ ప్రెసిడెంట్, అమెజాన్ ఇండియా, అన్నారు.
ఎఐ-శక్తిని కలిగిన టూల్స్‌తో షాపింగును అమెజాన్ నిరాఘాటం చేసింది. రఫూస్తో, అమెజాన్ వారి ఎఐ-శక్తి కలిగిన షాపింగ్ అసిస్టెంట్‌తో, కస్టమర్లు ఉత్పత్తులను కనుగొనవచ్చు, వ్యక్తిగతంగా అనువైన సిఫార్సులను పొందవచ్చు. తద్వారా వారి షాపింగ్ అనుభవం మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. లెన్స్ AIతో కస్టమర్లు సోషల్ మీడియాలో లేదా ఆఫ్‌లైన్‌లో కనిపించే ఏ ఉత్పత్తి ఫోటో అయినా తీసి, వాటిని తక్షణమే Amazon.inలో కనుగొనవచ్చు. AI ఇచ్చే రివ్యూతో, వేలాది మంది ఇచ్చే రివ్యూల నుండి క్రోడీకరించిన కీలకమైన అంశాలను త్వరగా గ్రహించవచ్చు. తద్వారా అవసరమైన విషయాన్ని సంగ్రహీకరించటం ద్వారా నిర్ణయాన్ని తీసుకునే ప్రక్రియ సరళం అయ్యింది. ద వ్యూ ఇన్ యువర్ రూమ్ ఫీచర్‌తో కస్టమర్లు, ఫర్నీచర్ మరియు డెకోర్లు తమ స్వంత గదిలో ఎలా ఉండగలవో ఊహించుకునే అవకాశం కల్పిస్తుంది. క్విక్ లెర్న్, బయింగ్ గైడ్స్ ఫీచర్లతో కస్టమర్లు, విషయాలను తెలుసుకుని మరింత త్వరగా, భరోసాతో కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు.
అన్ని కస్టమర్ల విభాగాల్లో టెక్ అప్గ్రేడ్ల వడి పెరిగింది
వన్‌ప్లస్, సామ్సంగ్, యాపిల్ మరియు iQOO లకు చెందిన అధిక-స్పెసిఫికేషన్లు కలిగిన డివైస్‌లకు కస్టమర్లు ఎక్కువమంది అప్‌గ్రేడ్ కావటంతో, క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడు రెండంకెల రెట్లు ఎక్కువ విక్రయాలను ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగం నమోదు చేసుకున్నది. సగటు కొనుగోల ధరలో క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడు 15 శాతం ఎక్కువ పెరుగుదలతో, 2వ మరియు 3వ శ్రేణి పట్టణాలు బలమైన ట్రెండ్లను సూచించాయి. అందుబాటు ధరల్లో ఉండే స్మార్ట్‌ఫోన్ విభాగం (₹10,000లకు తక్కువ), విలువపరంగా చూస్తే 1.5 రెట్లు పెరుగుదల నమోదు చేసుకుంది. 70 శాతానికి పైగా కస్టమర్లు 5జి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయటం పట్ల మక్కువ ప్రదర్శించారు. 5G అవలంబనను ముందుండి నడిపిస్తున్న బ్రాండ్లలో రెడ్మి, రియల్‌మి, సామ్సంగ్ మరియ లావా ఉన్నాయి. యాపిల్ మాక్‌బుక్ ఎయిర్ M4 అత్యధికంగా కొనుగోలు చేయబడిన ప్రీమియం ఉపకరణంగా నిలువగా, క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడు 1.5 రెట్ల పెరుగుదలతో ల్యాప్‌టాప్‌లు బలమైన వడిని నమోదు చేసుకున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ టాబ్ A11+ అగ్రస్థానంలో నిలువగా టాబ్లెట్లు ఒక విభాగంగా అభివృద్ధి చెందటం కొనసాగిస్తున్నాయి.
గృహోపకరణాలు మంచి ఎదుగుదలను ప్రదర్శించాయి. ఫీచర్లను పుష్కలంగా కలిగిన వేరియంట్లు మరియు సాంకేతికపరిజ్ఞానాల పట్ల కస్టమర్లు మక్కువ చూపటం ఇందుకు కారణం. వాషర్ డ్రయ్యర్లు 11 రెట్లు పెరుగుదల నమోదు చేసుకోగా, దానికి సరసనే రెఫ్రిజిరేటర్లు, 2 టన్ల ఎయిర్ కండీషనర్లు కూడా, క్రిందటి ఏడుతో పోలిస్తే ఈ ఏడు రెండింతలు పెరుగుదల నమోదు చేసుకున్నాయి. ప్రీమియం బ్రాండ్లైన LG, సామ్సంగ్, బాష్ వంటి ప్రీమియం బ్రాండ్లు ఈ పెరుగుదలకు ప్రధానంగా దోహదం చేశాయి. TVల విక్రయాలలో భారీ పెరుగుదల కనిపించింది. క్రిందటేడు కన్నా ఈ ఏడు లార్జ్-స్క్రీన్ మోడళ్ళ విక్రయం రెండింతలయ్యింది. 75-అంగుళాలు, అంతకన్నా పెద్ద TVల విక్రయాలు 2 రెట్లు పెరిగాయి. సోనీ మరియు TCL, ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. కస్టమర్లు ఎక్కువగా 55-అంగుళాలు మరియు QLEDకి ఎగువ మరియు మినీ-LED TVల పట్ల మక్కువ చూపించారు. రోజుకు ₹99లతో మొదలయ్యే నో-కాస్ట్ EMIలు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ లాభాలు ఇందుకు సహకరించాయి.
ఫ్యాషన్ & బ్యూటీ విభాగాల్లో అద్వితీయమైన అభివృద్ధి చోటుచేసుకుంది
ఫ్యాషన్ మరియు సౌందర్యసాధనాల విభాగంలో, వివాహాల సీజన్ మరియు వార్డ్రోబ్ను సరికొత్తగా మార్చుకునే ఉద్దేశ్యంతో జరిపిన కొనుగోళ్ళ కారణంగా, 3 రెట్లు పెరుగుదల నమోదు చేసుకుంది. విలువైన నగల విక్రయాలు క్రిందటేడాదితో పోలిస్తే మూడింతలు పెరిగింది. దానితోపాటే ఎథ్నిక్ దుస్తుల విక్రయాలు కూడా బాగా పెరిగాయి. లైనెన్ క్లబ్ మరియు కాల్పిన్ క్లీన్లు 2 రెట్లకు పైగా ఎక్కువ విక్రయాలను నమోదు చేసుకోవటంతో దుస్తుల విక్రయాలు అద్భుతంగా పెరిగాయి. పలు బ్రాండ్లు 2 రెట్లకు పైగా విక్రయాలను నమోదు చేసుకోవటంతో D2C బ్రాండ్లు ముందుకు దూసుకుపోయాయి. దైనందిన ఫైన్ జ్యువలరీ క్రిందటి ఏడాదితో పోలిస్తే 4 రెట్ల కన్నా ఎక్కువగా విక్రయాలను నమోదు చేసుకోవటంతోను, ల్యాబ్‌గ్రోన్ వజ్రాలు దాదాపు 40 రెట్ల విక్రయాలను నమోదు చేసుకోవటంతోను, నగలు అత్యద్భుతమైన అమ్మకాలను నమోదు చేసుకున్నాయి. ఆటోమాటిక్ గడియారాలు ఎక్కువగా అమ్ముడు కావటంతో, సగటు విక్రయ ధర 10 శాతం పెరిగి, గడియారాల విక్రయాలు 1.75 రెట్లు పెరిగాయి. కొరియన్ సౌందర్యసాధనాల బ్రాండ్లు అగ్రభాగంలో నిలిచి 2 రెట్లు పెరుగుదలను, ఫ్రాగ్రెన్సులు (సుగంధసాధనాలు) 1.5 రెట్లు పెరుగుదలను నమోదు చేసుకోవటంతో, సౌందర్యసాధనాల విక్రయాలు 1.5 రెట్లు పెరిగాయి.
వివిధ విభాగాల్లో, పాదరక్షలు మరియు యాక్సెసరీలకు గొప్ప డిమాండ్ కనిపించింది. మహిళల షూస్ విక్రయాలు క్రిందటి ఏడాది కన్నా ఈ ఏడు 1.25 రెట్లు పెరిగాయి. క్యాంపస్ ఇందుకు ఎక్కుగా దోహదపడింది. కాగా, జౌక్ వంటి బ్రాండ్ల మంచి విక్రయాలను ప్రదర్శించటంతో హ్యాండ్‌బ్యాగ్‌లు ఇదే తరహా పెరుగుదలను ప్రదర్శించాయి. స్పోర్ట్స్ షూస్ అమ్మకాలు దాదాపు 1.2 రెట్లు పెరిగాయి. రీబక్ ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. ఈ విభాగాలున్న ప్రీమింయం విభాగం మొత్తం మీద అభివృద్ధి కన్నా వేగంగా అభివృద్ధి చెందింది. ఇందుకు, ప్రీమియం హ్యండ్బ్యాగ్ల విక్రయాలు దాదాపు 1.4 రెట్లు ఎక్కువ కావటం దోహదం చేసింది. నాణ్యమైన మరియు బ్రాండ్లకు చెందిన వస్తువులను కొనుగోలు చేయాలన్న కస్టమర్ల ప్రాధాన్యతకు ఇది దర్పణం..
సౌకర్యం, సుస్థిరత, స్మార్ట్ లివింగ్ కోసం కస్టమర్లు పెడుతున్న పెట్టుబడి పెరుగుతుండటంతో హోమ్ అప్గ్రేడ్లు వేగం పుంజుకున్నాయి
గృహాలంకరణ సామాగ్రులు, క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.2 రెట్లు పెరుగుదల నమోదు చేసుకున్నాయి. లైటింగ్ ఫిక్స్చర్లు ఈ పెరుగుదలకు అగ్రభాగాన నిలువగా, కర్టెన్లు అదే తరహా అభివృద్ధిని చూశాయి. పట్టణప్రాంతాల్లో కస్టమర్లు చోటును ఆదా చేసుకునే పద్ధతులను కోరుకోవటంతో, కొలాప్సిబుల్ వార్డ్‌రోబ్‌ల విక్రయాలు 3 రెట్లకు పైగా పెరిగాయి. ఫర్నీచర్ విక్రయాలు బాగా పెరిగాయి. స్టోరేజ్ మరియు మ్యాట్రెస్లు రెండూ 1.7 రెట్లు పెరగటం, ఆఫీసు డెస్కులు 1.5 రెట్లు పెరగటం ఇందుకు దోహదం చేశాయి.
BLDC ఫ్యాన్లు, ఇంటెలిజెంట్ వాటర్ ప్యూరిఫయర్లు, మరియు పర్యావరణానుకూలమైన ఉపకరణాలైన విద్యుత్తును ఆదా చేసే ఫ్యాన్లు, ఎయిర్ ఫ్రయర్లు మరియు వంటగది ఉకరణాల వంటివి 1.5 రెట్లు పెరగటంతో స్మార్ట్ మరియు సుస్థిరమైన అప్గ్రేడ్లు ఊపందుకున్నాయి. వాటర్ ప్యూరిఫయర్లను 1.4 రెట్లు ఎక్కువ మంది కస్టమర్లు అప్‌గ్రేడ్ చేసుకోవటంతో ఎక్స్ఛేంజ్ ఆఫర్లకు ప్రజాదరణ పెరిగింది. ఔట్‌డోర్ మరియు ఎనర్జీ సొల్యూషన్లు, క్రిందటి ఏడాదితో పోలిస్తే 1.5 రెట్లు పెరిగాయి. ఇందుకు ఎక్కువగా సోలార్ ప్యానెళ్ళు, జనరేటర్లు మరియు తోటపనుల పరికరాలు దోహదం చేశాయి. పోర్టబుల్ పవర్ స్టేషన్లు ప్రీమియమైజేషన్ చూడగా, లాన్ మరియు గార్డెన్ ఉత్పత్తులు 1.25 రెట్లు పెరగటానికి సుస్థిరమైన ఎనర్జీ సొల్యూషన్లు మరియు ఔట్‌డోర్ లివింగ్ ట్రెండ్లు దోహదం చేశాయి.
ఆరోగ్యం మరియు సంరక్షణలకు లభిస్తున్న ఆదరణ, వినియోగం పెరుగుదలను బాగా పెంచింది
అమెజాన్ ఫ్రెష్, క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడు 1.5 రెట్లు పెరిగింది. ఆరోగ్యం మరియు సంక్షేమం, రోజువారి వినియోగించే సామాగ్రుల పెరుగుదలకు దోహదం చేశాయి. ప్రోటీను మరియు న్యూట్రిషన్ విభాగం దాదాపు 2 రెట్లు అభివృద్ధి చెందింది. క్రిందటి ఏడాది కన్నా ఈ ఏడు కస్టమర్ యొక్క వాలెట్ షేర్ 1.3 రెట్లు ఎక్కన కావటం, భారతదేశంలో ఫిట్నెస్ పట్ల పెరుగుతున్న అవగాహనకు అద్దం పడుతుంది. శుభ్రతను కలిగించే పదార్ధాలు, అధిక-ప్రోటీను కలిగిన బ్రేక్‌ఫాస్ట్‌ల దిశగా కస్టమర్లు ముందడుగు వేయటంతో, ఆయుర్వేదం (దాదాపు 2 రెట్లు), బ్రాజిల్ నట్స్ (2 రెట్లు), జీరో-క్యాలరీ చక్కెర సబ్స్టిట్యూట్లు (3 రెట్లు) పెరుగుదల నమోదు చేసుకోగా, కాఫీ మరియు టీ పానీయాలు 1.5 రెట్ల వడిని కొనసాగించాయి. కస్టమర్లు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ఇందుకు దోహదం చేసింది.
ఆహార సప్లిమెంట్లు, న్యూట్రాస్యూటికల్స్, ప్రోటీన్ ఆహారం మరియు స్పోర్ట్స్ న్యూట్రిషన్, అన్నీ క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.4 రెట్లు పెరుగుదల నమోదు చేసుకున్నాయి. ప్రత్యేకమైన ఉపవిభాగాలు అసాధారణమైన వడిని సూచిస్తున్నాయి – ఎనర్జీ మరియు ఫోకస్ కెఫీన్ సప్లిమెట్లు (15 రెట్లకు పైగా), DAKE సప్లిమెట్లు (దాదాపు 10 రెట్లు), బెర్బెరైన్ సప్లిమెంట్లు (4 రెట్లు). రిఫైండ్ నూనెల నుండి కోల్డ్-ప్రెస్డ్ వేరియంట్లకు, మరియు ఎ2 ఘీకి మారి, కస్టమర్లు మార్పును అవలంబించారు. కాగా, వ్యక్తిగత సంరక్షణ మరియు గ్రూమింగ్ ఉత్పత్తుల్లో అన్ని విభాగాల్లో 2 రెట్లకు పైగా పెరుగుదల నమోదు అయ్యింది. శిశు సంరక్షణ ఉత్పత్తులు 1.5 రెట్లు అభివృద్ధి నమోదు చేసుకున్నాయి. అవీనో, సెబామెడ్, సెటాఫిల్ వంటి బ్రాండ్లు అగ్రస్థానంలో నిలిచాయి.
హోమ్ ఫిట్నెస్, ఇండోర్ స్పోర్ట్స్‌లో కస్టమర్లు పెట్టుబడి పెడుతున్నారు
క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం స్పోర్ట్స్ మరియు ఫిట్నెస్ ఉపకరణాలు 1.5 రెట్లు పెరుగుదల నమోదు చేసుకున్నాయి. హోమ్ ఫిట్నెస్ ట్రెండ్లు ఇందుకు దోహదం చేశాయి. ఎంట్రీ స్థాయిలోనూ, ప్రీమియం విభాగాల్లోనూ కూడా ట్రెడ్మిల్స్ మరియు వాకింగ్ ప్యాడ్లు అభివృద్ధిలో అగ్రభాగంలో నిలవటంతో కార్డియో విభాగం 2 రెట్లు పెరుగుదల నమోదు చేసుకుంది. స్పిన్బైక్ల విక్రయం దాదాపు 1.5 రెట్లు పెరిగింది. కాగా రోవర్లు, డెస్క్ బైక్‌ల వంటి ప్రీమియం ఫిట్నెస్ ఉపకరణాలు మంచి పెరుగుదల నమోదు చేసుకున్నాయి. హూప్ ఫిట్నెస్ ట్రాకర్ విం ప్రీమియం ఫిట్నెస్ వేరబుల్సుకు బలమైన డిమాండ్ కనిపించింది. క్రిందటి ఏడాదితో పోలిస్తే బ్యాడ్మింటన్ 1.5 రెట్లు పెరుగుదల నమోదు చేసుకోవటంతో ఇండోర్ స్పోర్ట్స్ విక్రయాల్లో మంచి వడి నమోదయ్యింది. యోనెక్స్ ఈ పెరుగుదలకు అగ్రభాగంలో నిలిచి, ఇంటి వద్ద ఫిట్నెస్ ఆప్షన్లను అందుబాటులో పెట్టుకోవటం పట్ల కస్టమర్ల వైఖరికి అద్దం పట్టింది.
ఆటోమేటివ్ విడిభాగాల విక్రయంలో మంచి పెరుగుదల చోటు చేసుకుంది
క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆటోమోటివ్ విభాగం 1.35 రెట్లు పెరిగింది. ఆటో ఉపకరణాలు మరియు పరికరాలు 1.5 రెట్లు పెరిగాయి. కాగా మోటర్‌సైకిల్ దుస్తులు మరియు హెల్మెట్లు దాదాపు 1.4 రెట్లు పెరిగాయి. యాక్సర్ వంటి బ్రాండ్లకు చెందిన ప్రీమియం హెల్మెట్లు, అగారో మరియు డైలెక్ట్లకు చెందిన ప్రెషర్ వాషర్లు, క్యూబోకు చెందిన డాష్‌క్యామ్‌లు, కార్ప్లే సిస్టమ్‌లు మరియు పోర్ట్రోనిక్స్కు చెందిన టైర్ ఇన్ఫ్లేటర్లలో కస్టమర్లు పెట్టుబడి పెట్టారు.
అమెజాన్ బజార్లో అతి తక్కువ ధర శ్రేణి మరింత ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చింది
అమెజాన్ బజార్ యొక్క అతి తక్కువ ధరల శ్రేణి కారణంగా క్రిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్డర్లు 3 రెట్లు పెరిగాయి. కొత్తగా నమోదు చేసుకున్నకస్టమర్ల సంఖ్య, ప్రత్యేకించి 2వ మరియు 3వ శ్రేణి పట్టణాలకు చెందినవారి సంఖ్య, 1.4 రెట్లు పెరగటం ఇందుకు కారణం. సాధారణంగా జరిగే బిజినెస్‌తో పోలిస్తే ఆర్డర్లు 1.4 రెట్లు పెరగటం, సేల్ సందర్భంగా వడి కొనసాగటానికి నిదర్శనంగా నిలిచింది.
అమెజాన్ బిజినెస్‌లో B2Bకి బలమైన డిమాండ్ కనిపించింది
బిజినెస్‌లు టెక్నాలజీ అప్డేట్లకు ప్రాధాన్యమివ్వటంతో, ఆర్డర్లలో 60 శాతం 2వ మరియు 3వ శ్రేణి పట్టణాల నుండి లభించటంతో అమెజాన్ బిజినెస్ క్రిందటేడాదితో పోలిస్తే ఈ ఏడు 2.5 రెట్లు పెరిగింది. పెరుగుదలలో అన్నింటికన్నా ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు మరియు ఎలక్ట్రానిక్స్ 4 రెట్లు పెరుగుదల నమోదు చేసుకోగా, టివిలు మరియు గృహోపకరణాలు 1,7 రెట్ల పెరుగుదల నమోదు చేసుకున్నాయి. కంపెనీలు తమ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేసుకోవటంలో, నిత్యావసరాలను స్టాక్ చేసుకోవటంతో, ఆఫీసు ఫర్నీచర్ మరియు శుభ్రపరిచేందుకు కావలసిన సామాగ్రులు రెండూ 1.5 రెట్లు పెరగటంతో, బిజినెస్ చేసుకునే వారు పని చేసే ప్రదేశాలను మరింత మెరుగుపరచటంలో పెట్టుబడి పెట్టినట్లయ్యింది. బిజినెస్‌ల వారు సాంప్రదాయేతర ఇంధన వనరులతో కూడిన ఉపకరణాలను అవలంబించటంతో, సోలార్ ప్యానెళ్ళు దాదాపుగా 3 రెట్లు పెరుగుదలను నమోదు చేసుకోవటంతో, సుస్థిరత బలంగా ఆవిర్భవించింది.బిజినెస్ కస్టమర్లు ప్రైమ్‌ను తీసుకోవటం 1.5 రెట్లు పెరిగి, టోకు డిస్కౌంట్లు, క్రెడిట్ సౌకర్యం, అమెజనా బిజినెస్ లో ఇంకా ఎన్నో లాభాల పట్ల పెరుగుతున్న ఆదరణకు ప్రతీకగా నిలిచింది.
ట్రావెల్ మరియు పేమెంట్ల కోసం ఎక్కువమంది అమెజాన్ పేను ఉపయోగించడం కనిపించింది
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025తో పోలిస్తే, అమెజాన్ పేలో హోటల్ బుకింగులలో ఏటికాయేడు 1.5 రెట్ల పెరుగుదల చోటు చేసుకుంది. విలువపరంగా చూస్తే దాదాపు 1.4 రెట్లు పెరుగుదల నమోదుకాగా, పరిమాణం పరంగా చూస్తే 1.4 రెట్ల పెరుగుదల నమోదు చేసుకుంది. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యూజర్ల విషయానికి వస్తే ఏటికాయేడు 1.34 రెట్ల పెరుగుదల నమోదు చేసుకుంది. ఇది, కస్టమర్లకు ఉన్న బలమైన విశ్వాసం, వారు ఎక్కువగా ఈ సేవలను ఉపయోగించటానికి తార్కాణంగా నిలుస్తుంది. సేల్ సమయంలో ప్రతి నలుగురు కస్టమర్లలో ఒకరు అమెజాన్ పే చెల్లింపు పద్ధతులను ఉపయోగించారు. దీనితో కొత్త కార్డులు జారీ చేయటం ఏటికాయేడు చొప్పున స్థిరంగా పెరుగుదలను నమోదు చేసుకున్నది.



