నవతెలంగాణ – హైదరాబాద్: భారతీయ సంప్రదాయ వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘గ్లోబల్ ఆయుష్’ దార్శనికతకు అనుగుణంగా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణ అందించాలన్న సంకల్పానికి నిదర్శనంగా ‘అద్వెన్ బయోటెక్’ ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) ప్రమాణాలతో గుర్తింపు పొందిన మొట్టమొదటి హోమియోపతి బ్రాండ్‌గా అవతరించింది. హోమియోపతి మందుల తయారీలో అంతర్జాతీయ స్థాయి కచ్చితత్వం, పారదర్శకతను ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ ఇప్పటికే ‘ఆయుష్ ప్రీమియం మార్క్’ను కూడా సొంతం చేసుకుంది. ఈ రెండూ ప్రతిష్టాత్మక గుర్తింపులు సాధించిన ఏకైక సంస్థగా నిలిచింది.
ఈ సందర్భంగా అద్వెన్ బయోటెక్ సీఈఓ ఆదేశ్ శర్మ మాట్లాడుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఆయుష్ విధానాన్ని సైన్స్, నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విశ్వసనీయ గ్లోబల్ హెల్త్‌కేర్ సిస్టమ్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షకు ఈ విజయం బలాన్ని చేకూరుస్తుందన్నారు. హోమియోపతి ఔషధాల తయారీలో నాణ్యతపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ.. కచ్చితత్వం, పారదర్శకత, విశ్వసనీయతలో అద్వెన్ బయోటెక్ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అద్వెన్ నాణ్యత నియంత్రణ, పరీక్షా ప్రయోగశాలలు అత్యున్నత జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్నాయని ధృవీకరించబడిందన్నారు. ఈ సర్టిఫికేషన్ వల్ల డాక్టర్లు, రోగులలో నమ్మకం పెరగడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ హోమియోపతికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భారతీయ వైద్య విధానాలు శాస్త్రీయత, నాణ్యతతో ప్రపంచ వేదికలపై నిలబడాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన విజన్ అన్నారు. ఈ గుర్తింపు కేవలం అద్వెన్కు దక్కిన గౌరవం మాత్రమే కాదని, సురక్షితమైన, ప్రభావవంతమైన వైద్యం కోసం హోమియోపతిని నమ్ముతున్న లక్షలాది మంది రోగులకు ఒక భరోసా అన్నారు. హోమియోపతి ప్రాథమిక సూత్రాలను దెబ్బ తీయకుండా ఈ వైద్య విధానాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యంతో అద్వెన్ బయోటెక్ స్థాపించబడిందన్నారు.
పరిశోధన ఆధారిత ఫార్ములేషన్లు, నైతిక విలువలు, అధునాతన తయారీ వ్యవస్థలపై ఈ సంస్థ నిరంతరం దృష్టి సారిస్తోందన్నారు. ఈ సర్టిఫికేషన్‌తో అద్వెన్లోని ప్రతి పరీక్ష, ప్రతి ప్రక్రియ, ప్రతి మందు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ప్రోటోకాల్స్ ద్వారా ధృవీకరించబడుతున్నాయని తెలిపారు. దీనివల్ల మెట్రో నగరాల్లోనే కాకుండా, చిన్న నగరాలు, పట్టణాల్లోని రోగులకు కూడా మరింత నాణ్యత, మెరుగైన ఫలితాలు, గొప్ప నమ్మకాన్ని కలిగిస్తాయన్నారు. ప్రజలకు ఇప్పుడు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన హోమియోపతి మందులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

