Thursday, February 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాల్లేవు

ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాల్లేవు

- Advertisement -

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తేల్చారు. సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను స్పీకర్‌ కొట్టివేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ చాంబర్‌లో అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ జరిపారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు తగిన ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్‌ను కొట్టివేశారు. ఫిరాయింపుల కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందికి స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, టి. ప్రకాష్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, తాజాగా సంజయ్ కుమార్‌లకు ఊరట లభించింది. ఇంకా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ అనర్హతపై విచారణ పెండింగ్‌లోనే ఉంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే : సంజయ్ కుమార్‌
‘నేను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేనే. ఆ పార్టీ నుంచే గెలిచా. నా జీతం నుంచి ప్రతి నెలా రూ. 5000 బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇస్తున్నా. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ బిల్లులు ప్రవేశపెట్టి, విప్‌ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తా. నేనెప్పుడూ బీఆర్‌ఎస్‌ను, అధిష్టానాన్ని విమర్శించలేదు. స్థానిక నాయకత్వం నాకు దూరంగా ఉంది. నాది అభివృద్ధి కోసమే ఆరాటం. నాతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇండిపెండెంట్‌ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తా. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా, జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించండి. జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తా అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -