Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంమెల్‌బోర్న్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం

మెల్‌బోర్న్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం

- Advertisement -

తీవ్రంగా ఖండించిన భారత్‌
న్యూఢిల్లీ
: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తొలగించిన ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని భారత్‌ కోరింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి రన్‌ధీర్‌ జైస్వాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ”మెల్‌బోర్న్‌లోని ఆస్ట్రేలియన్‌ ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం, తొలగించడం తీవ్రంగా ఖండనీయం. ఈ అంశాన్ని మేం ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం” అని ఆయన తెలిపారు.
గతనెల 12న అర్ధరాత్రి సుమారు 12.50 గంటలకు ఈ దొంగతనం జరిగింది. మెల్‌బోర్న్‌లోని రోవ్‌విల్‌ ప్రాంతంలోని కింగ్స్‌లీ క్లోజ్‌లో ఉన్న ఆస్ట్రేలియన్‌ ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌ ప్రాంగణంలో 426 కిలోల బరువైన కాంస్య గాంధీ విగ్రహాన్ని నిందితులు యాంగిల్‌ గ్రైండర్‌తో పునాదుల నుంచి తొలగించి తీసుకెళ్లారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో కొంతవరకు నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -