కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యేకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్నారని ఆమె చెప్పారు. ఆ సమావేశంలో పాల్గొనడం అంటేనే పార్టీ ఫిరాయించినట్టు కదా! ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి? అని కవిత ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌లు ఇవ్వడం ఎంత వివాదాస్పదం అయ్యిందో లోకమంతా చూసింది. అయినా ఆ విషయం మీ దృష్టికి రాలేదా?. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారని అనడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేసిన స్పీకర్ రాజ్యాంగ బద్దమైన స్పీకర్ చైర్‌లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? అదే నిజమైతే మీరు భారత రాజ్యాంగాన్ని, చట్ట సభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడగలుగుతారు..? అని ఆమె స్పీకర్‌ను ప్రశ్నించారు.
స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



