న్యూఢిల్లీ : ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది వంద బిలియన్ డాలర్ల విలువ కలిగిన విమానాలు, టెక్నాలజీ వస్తువులు, విలువైన లోహాలు, చమురు, అణు ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ సమ్మతించింది. గత సంవత్సరం చేసుకున్న దిగుమతుల విలువకు ఇది రెట్టింపు కంటే ఎక్కువేనని తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 45.62 బిలియన్ డాలర్ల విలువ కలిగిన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. అదే సమయంలో అమెరికాకు 86.51 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరిపింది. వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్ 500 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయోత్పత్తులు, బొగ్గు తదితర ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
వ్యవసాయ మార్కెట్లను ముంచెత్తే అమెరికా ఉత్పత్తులు
మన వ్యవసాయ రంగంలోకి ప్రవేశించేందుకు ఈ ఒప్పందం అమెరికాను అనుమతించింది. ఆ దేశానికి చెందిన అనేక వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లకు చేరతాయి. అయితే జన్యుపరంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులు, సోయా మీల్ (పశువులకు అందించే దాణా), పౌల్ట్రీ, మొక్కజొన్న, ఆహార ధాన్యాలపై భారత్ తన రక్షణలను కొనసాగిస్తుంది. పత్తి, పప్పులు, చెస్ట్‌నట్స్, ఉల్లిగడ్డలు వంటి వ్యవసాయోత్పత్తులను పరిమిత స్థాయిలో అనుమతిస్తుంది. అమెరికా నుంచి ఆపిల్స్ వంటి పండ్ల దిగుమతులను కూడా భారత్ అనుమతిస్తుంది. న్యూజిలాండ్ నుంచి ఆపిల్స్, యూరోపియన్ యూనియన్ నుంచి కివీలు, ముత్యాలు, పశ్చిమ దేశాల వాణిజ్య భాగస్వాముల నుంచి వైన్, స్పిరిట్స్, బీరు వంటివి ఇప్పటికే భారత మార్కెట్‌లో ప్రవేశించాయి.
భారత్ కొనుగోలు చేసేవి ఇవే…
- Advertisement -
- Advertisement -



