– తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జి పెరుమల్ విశ్వనాథం
నవతెలంగాణ-వర్ధన్నపేట/పరకాల
ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసి చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జి పెరుమాళ్ విశ్వనాధం అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వర్ధన్నపేటలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ఆరుగురు మహిళలను, ఆరుగురు పురుషులను నిలబెట్టామని, వారిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత పదేండ్లలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే పట్టణ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. అబద్దాలతో అసత్యపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. ఈ సందర్భంగా 12 మంది వార్డు అభ్యర్థులు వేదిక ముందు అభివాదం చేశారు. అనంతరం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి పి. విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(టీస్కాబ్) మాజీ చైర్మెన్ మార్నేని రవీందర్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు, ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల వెంకటరామిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, ఐనవోలు దేవస్థానం చైర్మెన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



