Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమదురో దంపతులను విడుదల చేయాలి

మదురో దంపతులను విడుదల చేయాలి

- Advertisement -

కారకస్‌లో భారీ ప్రదర్శన

కారకస్‌ : అధ్యక్షుడు నికొలస్‌ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని కారకస్‌లో మంగళవారం వేలాదిమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. రాత్రి వేళల్లో అధ్యక్షుడి భవనంపై దాడి చేసి దంపతులను అమెరికా బలగాలు కిడ్నాప్‌ చేసిన నెల రోజులకు ఈ ప్రదర్శన జరిగింది. ‘వెనిజులాకు నికొలస్‌ అవసరం’ అంటూ ప్రజలు చేసిన నినాదాలు మార్మోగిపోయాయి. ‘ది గ్రేట్‌ మార్చ్‌’ పేరుతో ఈ ప్రదర్శన జరిగింది. అనేక ప్రభుత్వ రంగాల వర్కర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వెంట ట్రక్కులతో, నినాదాలతో ప్రదర్శన ఆద్యంతం సాగింది. అధ్యక్షుడికి మద్దతుగా వేలాదిమంది ప్లకార్డులు చేబూనారు. వారు విడుదల కావాలని కోరుతున్న టీ షర్ట్‌లు ధరించారు.

‘అమెరికా సామ్రాజ్యవాదం వారిని కిడ్నాప్‌ చేసింది, వారిని వెనక్కి పంపించాలి’అని రాసి వున్న బ్యానర్లు ప్రదర్శించారు. మదురో దంపతుల విడుదల కోరుతూ అంతర్జాతీయ కార్యాచరణలో భాగంగా ఈ ప్రదర్శన జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు, సంఘీభావ ప్రదర్శనలు, కార్యాచరణలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు మదురో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన నికొలస్‌ మదురో గుయెర్రా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. విదేశీ సైన్యం తమ మాతృభూమిని అపవిత్రం చేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా మిలటరీ కిడ్నాప్‌ ఘటన తమ జీవితాల్లో ఎప్పటికీ మాయని మచ్చలా వుండిపోతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -