- Advertisement -
చెన్నయ్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ లిమిటెడ్ 54.5 శాతం వృద్ధితో రూ.44 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.28 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.443 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ3లో రూ.540 కోట్లకు పెరిగింది. 2025 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల్లో సంస్థ నికర లాభాలు 74.3 శాతం వృద్ధితో రూ.118 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది మాసాల్లో రూ.68 కోట్ల లాభాలు ఆర్జించింది.
- Advertisement -



