Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎన్నికల నేపథ్యంలో నేపాల్‌ వ్యాప్తంగా 3లక్షల మంది భద్రతా సిబ్బంది మొహరింపు

ఎన్నికల నేపథ్యంలో నేపాల్‌ వ్యాప్తంగా 3లక్షల మంది భద్రతా సిబ్బంది మొహరింపు

- Advertisement -

ఖాట్మండు : ఎన్నికల నేపథ్యంలో భద్రతను పెంపొందించే నిమిత్తం నేపాల్‌ వ్యాప్తంగా వేలాదిగా బలగాలను మోహరించారు. మార్చి 5న జరిగే ఎన్నికలకుగానూ ముందస్తుగా మొత్తంగా మూడు లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎన్నికల కోసం తాత్కాలికంగా బరిలోకి దింపిన పోలీసులను కూడా పలు ప్రాంతాల్లో నియమించారు. వేలాదిమంది యువకులను తాత్కాలికంగా పోలీసింగ్‌ విధుల కోసం నియమించారు. గతేడాది తీవ్రంగా చెలరేగిన నిరసనలతో అప్పటి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మొదటగా జరుగుతున్న ఎన్నికలు ఇవే.

రాబోయే ఎన్నికలు మరింత స్వేచ్ఛగా, భద్రతా వాతావరణంలో జరిగేలా చూసేందుకు గానూ భద్రతా ఏర్పాట్లను అత్యంత కట్టుదిట్టంగా చేస్తున్నామని హోం శాఖ ప్రతినిధి ఆనందా కాఫ్లె చెప్పారు. అనుకున్న ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి తాము కూడా సిద్ధంగా వున్నామని నేపాల్‌ ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. గత సెస్టెంబరులో అవినీతి వ్యతిరేక నిరసనలు చెలరేగడంతో అప్పటి ప్రధాని కె.పి.శర్మ ఓలి రాజీనామా చేశారు. దాంతో అప్పటి నుంచి తాత్కాలిక ప్రభుత్వమే కొనసాగుతోంది. 77మంది మరణించగా, వేలాదిగా భవనాలు, ఇళ్ళు కూల్చివేశారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -