Thursday, February 5, 2026
E-PAPER
Homeబీజినెస్ఘనంగా గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ మహాసభ

ఘనంగా గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ మహాసభ

- Advertisement -

– ప్రధాన కార్యదర్శిగా మరోసారి డిమిత్రిన్‌ ఎన్నిక
ఏథేన్స్‌ :
గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) 22వ మహాసభ ఘనంగా జరిగింది. జనవరి 29 నుంచి 31 తేదీల్లో మహాసభను ‘కెకెఇ బలంగా, ప్రతీ పరీక్షలో స్థిరంగా, సోషలిజం కోసం చారిత్మ్రాక పిలుపునకు సిద్ధంగా’ అనే నినాదంతో నిర్వహించారు. నూతన కేంద్ర కమిటీ ఎన్నికతోనూ పార్టీ వ్యూహాత్మక, సంస్థాగత దిశను పునురుద్ఘాటించడంతో మహాసభ ముగిసిందని కెకెఇ పేర్కొంది. 95 మందితో నూతన కేంద్ర కమిటీని, తొమ్మిది మందితో కేంద్ర ఆడిట్‌ కమిటీని ఎన్నుకోగా, మహాసభ తరువాత జరిగిన కేంద్ర కమిటీ మొదటి సమావేశంలో డిమిత్రిన్‌ కౌత్సౌంబాస్‌ను కెకెఇ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 19 మందితో పొలిట్‌బ్యూరోను కూడా ఎన్నుకున్నారు. కాగా, మహాసభ ప్రారంభ కార్యక్రమం ఏథెన్స్‌లోని గలాట్సి ఒలింపిక్‌ హాల్‌లో జరిగింది. మొత్తం 85 మంది ప్రతినిధులు ప్రసంగించారు. కార్మిక పోరాటాలు, ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. కెకెఇని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని మహాసభ ప్రముఖంగా ప్రస్తావించింది. మహాసభకు సమర్పించిన నివేదికల ప్రకారం 21, 22 మహాసభల మధ్య పార్టీ బలం దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగినా, స్పష్టంగా పెరిగింది. అలాగే, పార్టీ ప్రస్తుత సభ్యుల్లో సగం మందికి పైగా సభ్యులు 50 ఏళ్ల లోపువారే ఉన్నారు. అలాగే, సిపిఎం, క్యూబా కమ్యూనిస్టు పార్టీ, వియత్నాం కమ్యూనిస్టు పార్టీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక కమ్యూనిస్టు పార్టీలు మహాసభకు సౌహార్ధ సందేశాలు పంపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -