Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనైజీరియాలో రెచ్చిపోయిన మిలిటెంట్ దళాలు.. 162 మంది మృతి

నైజీరియాలో రెచ్చిపోయిన మిలిటెంట్ దళాలు.. 162 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నైజీరియాలోని క్వారా రాష్ట్రంలోని రెండు గ్రామాల్లో మిలిటెంట్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 162 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇటీవలి కాలంలో ఇదే అత్యంత భయానక దాడిగా స్థానిక నేతలు పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్‌కు అనుబంధంగా ఉన్న లకురావా మిలిటెంట్ గ్రూప్‌ ఈ హత్యాకాండకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటరీ ఆపరేషన్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. మారుమూల ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు, భద్రతా బలగాల చేరిక ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -