కాంగ్రెస్ అభ్యర్థి రేణుక శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – సదాశివపేట
పట్టణాల అభివృద్ధి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సహకారంతో భారీ ఎత్తున నిధులు మంజూరు చేయించి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులతో వార్డుల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



