జెఎంకెపిఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నిజాంబాద్ మార్కెట్లో ( గంజిలో) వ్యాపారస్తులు మంచి నాణ్యత గల పసుపుకు సరైన ధర అందించాలని మండలం లొని మనోహరాబాద్ గ్రామ పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ పసుపు మార్కెట్ ని సందర్శనలో భాగంగా అక్కడ జరుగుతున్న పసుపు క్రయవిక్రయాల గురించి జెఎంకెపిఎం పసుపు రైతు ఉత్పద్దార్ల సంఘం చైర్మన్ పాటుకూరి తిరుపతిరెడ్డి సందర్శించి అక్కడ పసుపు అత్యంత నాణ్యతగా ఉంటుందని వ్యాపారుల దృష్టిలో ఒక నమ్మకం కలిగిందన్నారు.
కాబట్టి ముఖ్యంగా మన నిజాంబాద్ జిల్లా నుండి చాలా గ్రామాల రైతులు పసుపును మంచిగా ఎండబెట్టి శుద్ధిచేసి డబుల్ పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ రకంగా తయారు చేసుకుని మార్కెట్కు తీసుకురావడం వలన మంచి ధర వస్తుందని తెలుసుకున్నామన్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన బీట్ లో మన నిజాంబాద్ జిల్లా అంక్సాపూర్ గ్రామం నుంచి వచ్చిన కొమ్ముకు అత్యధిక ధర రూ.16,800, మండకు రూ.13000 ధర పలకడం పసుపు రైతుకు శుభాసూచకమన్నారు.
మరి ఇదే రకంగా నిజాంబాద్ మార్కెట్లో కూడా (గంజిలో) కూడా, వ్యాపారస్తులు మంచి నాణ్యత గల పసుపుకు సరైన ధర అందించాలని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున టర్మరిక్ బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డికి, స్థానిక నిజాంబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డికి కూడా మేము విన్నవిస్తున్నామని అన్నారు.



