Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రివ్యూ మీటింగ్ 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రివ్యూ మీటింగ్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఆలేరు హౌజింగ్ ఏఈ డి.జ్యోతి, హౌజింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 16 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో 2 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, 8 ఇళ్లకు స్లాబ్ పూర్తయిందని తెలిపారు. 2 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు నిర్మాణం జరగగా.. 4 ఇళ్లకు బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిందని వివరించారు. అయితే 6 ఇళ్లకు సంబంధించిన స్లాబ్ బిల్లులు పూర్తిగా రాలేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి చెల్లించాలని అధికారులను కోరారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని సమావేశంలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -