- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో మహిళలే అధికంగా (50.27 శాతం) ఉన్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 398 మంది, ఆదిలాబాద్‌లో 314 మంది పోటీపడుతుండగా, కొడంగల్‌లో అత్యల్పంగా 34 మంది ఉన్నారు. అధికార కాంగ్రెస్ 98.3 శాతం స్థానాల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థుల్లో 1,291 మంది నిరక్షరాస్యులు కావడం గమనార్హం.
- Advertisement -



