Thursday, February 5, 2026
E-PAPER
Homeఖమ్మంఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ

ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ

- Advertisement -

కార్యక్రమంలో పాల్గొన్న బోనకల్ ఉపాధ్యాయులు
నవతెలంగాణ – బోనకల్

ఏఐ జాక్టో, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపుమేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ధర్నాకు టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ జిల్లా నాయకులు సద్దా బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని, ఎన్ ఈ పి 2020 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్కమ్ టాక్స్ స్లాబ్ రేట్లు మార్పు చేయాలని, విద్యా ప్రవేటీకరణను విడనాడాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

బోనకల్ మండలం నుంచి ఢిల్లీ ధర్నాకు హాజరైన వారిలో టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ జల్లా కోటయ్య, పిఎస్ చిరునోముల హెచ్ డబ్ల్యు ఉపాధ్యాయురాలు కర్నాటి కవిత, జెడ్ పి ఎస్ ఎస్ రావినూతల ఉపాధ్యాయులు ఆర్ సరస్వతి ఉన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు టీఎస్ యుటిఎఫ్ మండల కోశాధికారి పి నరసింహ రావు మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, మండల ఉపాధ్యక్షురాలు బి సౌభాగ్య లక్ష్మి, యు గంగాభవాని, బి నిర్మల, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్ర సింహ, అలవాల నాగేందర్, సిహెచ్ కోటేశ్వరరావు, ఉయ్యాల రామారావు, కే సురేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -