జన సందోహం నడుమ మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి అంతిమ యాత్ర
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి అంతిమ యాత్ర గురువారం మంథని పట్టణం నుండి ముత్తారం మండలంలోని సీతంపేటలో ఉన్న తన ఫాం హౌస్ వరకు కొనసాగుతోంది. ఈ అంతిమయాత్రలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాళేశ్వరం దేవస్థానం మాజీ డైరెక్టర్ బండి రాజయ్య, తెలంగాణ ఉద్యమ కారులు ముడితనపెల్లి ప్రభాకర్, షేక్ చాంద్ పాష, చొప్పరి రాజు, మీనుగు నాగేష్, తోకల గణేష్ లు మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో కన్నీటి జోహార్లు తెలిపుతూ పాడె మోసి, తుది విడ్కోలు పలికారు.
నిజాయితీ, నిబద్దత, నిస్వార్థానికి నిలువుటద్దం చందుపట్ల రాంరెడ్డి అని కొనియాడారు. ఎమ్మెల్యే పదవికి, శాసనసభకే వన్నెతెచ్చిన ప్రజా నాయకుడు రామ్ రెడ్డి అని నిస్వార్ధంగా ఎలాంటి అవినీతికి, అక్రమాలకు చోటు లేకుండా పదవీ బాధ్యతలు నిర్వహించి నిరంతరం ప్రజల కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం, విద్యుత్, సాగునీరు త్రాగునీరు కోసం, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేషంగా కృషిచేసి మంథని నియోజకవర్గంలో ప్రజల మనిషిగా పేరుందారని కొనియాడుతూ ఘన నివాళులర్పించారు. స్వర్గీయ రాంరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



