Thursday, February 5, 2026
E-PAPER
Homeకరీంనగర్మరోసారి కేసీఆర్ ను సీఎంను చేస్తేనే అభివృద్ధి: కేటీఆర్

మరోసారి కేసీఆర్ ను సీఎంను చేస్తేనే అభివృద్ధి: కేటీఆర్

- Advertisement -

చిన్న జిల్లాలను తొలగించాలని కాంగ్రెస్ కుట్ర
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని, కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా పలు వార్డుల్లో ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని పంటలకు రైతుబంధు వేశాడు.. ప్రజలకు చెప్పాలని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారనీ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను పక్కన పెట్టారని ఆయన అన్నారు. మరోసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, మరొక్కసారి కాంగ్రెస్ ప్రజలను మోసం చేయడం ఖాయమని, ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టవలసిన అవసరం ఏముందని, చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన అన్నారు. కేవలం ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం తప్పించి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి రాష్ట్రంలో చేసిందో ప్రజలకు చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన కాంగ్రెస్కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల మోసం పైన ప్రశ్నించకుంటే, మరో మూడు సంవత్సరాల దాకా శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం రాదనీ,రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేలా ఈ ఎన్నికల్లో ఓటు వేయకుండా, సురుకు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తన మోసాలను కొనసాగిస్తుందని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -