Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలపై అవగాహన

విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. లెర్నింగ్ స్టాండర్డ్స్ వయా సైన్స్ ద్వారా ప్రమాణాల అవగాహన అనే అంశంపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ బ్రాంచ్ రిసోర్స్ పర్సన్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే నాణ్యత ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని, నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులపై ఉండే ఐఎస్ఐ  ముద్ర ప్రాముఖ్యత, హాల్‌మార్కింగ్, నాణ్యత ప్రమాణాలను శాస్త్రీయ సూత్రాల ద్వారా వివరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా స్టాండర్డ్ క్లబ్ మెంటర్ రాజు క్లబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, భవాని, ఉపాధ్యాయ బృందం సరిత, అరుణ, లలితతో, స్టాండర్డ్ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -