Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలుబాల్య వివాహాలు, బాల కార్మికత్వంపై అవగాహన

బాల్య వివాహాలు, బాల కార్మికత్వంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లలు, సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండని అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయకూడదని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వివరించారు. చిన్న పిల్లలు ఎక్కడైనా పనులు చేస్తూ ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సంస్థ కోఆర్డినేటర్ గిరిజ, సి.ఎస్‌.ఎం. సంధ్యారాణి, ఆశ వర్కర్లు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -