Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలి 

గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలి 

- Advertisement -

విద్యుత్ ఎస్ ఈ భీమ్లా నాయక్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చేయడమే ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులందరూ కూడా, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని జిల్లా విద్యుత్ ఎస్ ఈ భీమ్లా నాయక్ అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని మున్ననూర్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామంలో విద్యుత్ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, విద్యుత్ సమస్య వస్తే   రైతులు  నియంత్రల దగ్గరకు  అధికారులు వచ్చేవరకు వెళ్ళవద్దని సూచించారు.

రైతులు వ్యవసాయ బిల్లులు కూడా సకాలంలో చెల్లించాలని, 200 యూనిట్ వరకు విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. గ్రామంలోని ప్రతి వాడలో వ్యవసాయ పొలాల దగ్గర సమస్యలు ఉంటే గ్రామ సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రైతులు అందరు కూడా విద్యుత్ బిల్లుల చెల్లించే విధంగా  సహకరించాలని కోరారు. వ్యవసాయ విద్యుత్ బిల్లులు నెలకు రూ.30 బిల్లు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. గ్రామంలో మీటర్లు లేని ఇల్లు ఉండకూడదని మీటర్లు లేకుంటే డిడి కడితే కొత్త మీటర్ అధికారులు మంజూరు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డి ఈ చంద్రమౌళి ఏడిఈ చంద్రశేఖర్ ఏఈ నరేందర్ గౌడ్, సర్పంచ్ సుజాత మల్లికార్జున్ రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య, రైతులు వెంకట్ రెడ్డి,  మల్ రెడ్డి, వెంకటయ్య, నరసింహ, కృష్ణయ్య, విద్యుత్ సిబ్బంది కృష్ణయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -