Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలుఅభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్: ఎమ్మెల్యే వేముల

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్: ఎమ్మెల్యే వేముల

- Advertisement -

ఎన్నికలొస్తేనే కాంగ్రెస్ కు అభివృద్ధి గుర్తుకొస్తదా?
రూ.200 కోట్లతో భీంగల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే
ఆస్పత్రి, మార్కెట్ పనులను నిలిపివేసిన కాంగ్రెస్ ను నిలదీయండి
బీఆర్ఎస్ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్ (12 వార్డ్), అస్లాం (7 వ వార్డ్) రాజునాయక్ (11 వార్డ్) లను గెలిపించండి
నవతెలంగాణ – భీంగల్

భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12, 7, 11 వార్డుల లో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్, అస్లాం, రాజునాయక్ లను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంగా ఉన్న భీంగల్ ను మున్సిపాలిటీగా మార్చి, కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సుమారు 200 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత బి ఆర్ ఎస్  ప్రభుత్వానిదే అని, మొదటి విడతలో 25 కోట్లతో 80% వీధుల్లో సీసీ (సీసీ) రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి మురికి కూపంగా ఉన్న భీంగల్ ను సుందరంగా తీర్చిదిద్దాము, ఆర్ అండ్ బి (ఆర్&బీ) శాఖ ద్వారా 20 కోట్లతో 4 లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో భీంగల్ కు పట్టణ కళ తీసుకువచ్చాము అని అన్నారు. బి ఆర్ ఎస్  ప్రభుత్వ హయాంలోనే 30 కోట్లు వెచ్చించి పోచంపాడ్ ప్రాజెక్ట్ నుండి నీళ్లు తెచ్చి, ఇంటింటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించి ఆడబిడ్డల 60 ఏళ్ల తాగునీటి గోసను 

తీర్చాము. పేదలకు ఉచిత వైద్యం కోసం 40 కోట్లతో ఆసుపత్రి మంజూరు చేసి 80% పనులు పూర్తి చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా మిగతా పనులు చేయకుండా పేదలకు వైద్యాన్ని దూరం చేసింది.ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి 6 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు (70% పూర్తి) కాంగ్రెస్ హయాంలో ఆగిపోయాయి.

 కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ డిపోను, కోటి రూపాయలతో తిరిగి తెరిపించాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ డిపోను మూసివేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మిగిలిపోయిన సీసీ రోడ్ల పనులకు అసెంబ్లీ ఎన్నికల ముందే మేము 10 కోట్లు (Go No. 548) మంజూరు చేశాం.రెండేళ్లుగా ఆ పనులు ఆపేసిన కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాగానే హడావుడి శంకుస్థాపనలు చేస్తూ డ్రామాలు ఆడుతోంది. ఎన్నికలు లేకుంటే పనులు చేయరా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

మహిళలకు రూ. 2500, రూ. 4000 పెన్షన్, తులం బంగారం,కొత్త పెన్షన్లు ప్రారంభం, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, నిరుద్యోగ భృతి వంటి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే వాళ్లకు ప్రజల కోపం అర్థమవుతుంది. అప్పుడే హామీల అమలుకు దిగివస్తారు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం తప్ప, తెలంగాణ అభివృద్ధికి అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధి చేసిన టిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -