Thursday, February 5, 2026
E-PAPER
Homeక్రైమ్మృతదేహం భాగాలు లభ్యం

మృతదేహం భాగాలు లభ్యం

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ, సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ సమీపంలోని పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని పురుషుని మృతదేహ భాగాలు లభ్యమైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మిగిలిన  భాగాలు గురువారం లభ్యమైనట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2న బావి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు పరిశీలించగా.. మృతదేహ భాగాలు బయటపడ్డాయి. అయితే గురువారం మిగిలిన భాగాలు కూడా అదే ప్రాంతంలో లభ్యమైనట్లు ఆయన తెలిపారు.  మృతుడిని ఇతర ప్రాంతంలో హత్య చేసి, ఆధారాలు దాచేందుకు శరీరాన్ని ముక్కలుగా చేసి బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.89/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిమృతుడు సుమారు 25 – 30 ఏళ్ల కలిగిన పురుషుడిగా గుర్తించారు. గుర్తింపు వివరాల ఆధారంగా సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ఉపయోగకరమైన సమాచారం అందించిన వారికి రూ.10,000 నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. సమాచారాన్ని ఫోన్ నంబర్: 8712686145 కు తెలపాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -