Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆడపిల్ల ముద్దు.. బాల్యవివాహాలు వద్దు

ఆడపిల్ల ముద్దు.. బాల్యవివాహాలు వద్దు

- Advertisement -

బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలి
ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎంపీడీవో సింగారం కుమార్, ఎస్సై చిర్రా రమేష్ బాబు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

బాల్య వివాహాలు వద్దు ఆడపిల్ల ముద్దు బాల్య విహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపీడీవో సింగారం కుమార్, స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కేంద్రంలో షేర్ ఎన్జీవో & జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన బాల్య వివాహాల అవగాహన రథాన్ని ఎంపీడీవో కూమార్ ఎస్సై రమేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అన్నారు. బాల్యవివాహాలు పిల్లలు చదువు ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాల రహిత  జిల్లా గా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీవొ పద్మా  మధన్ తుర్తి కార్యదర్శి వెంకటేశ్వర్లు,నెల్లికుదు మడల కమ్యూనిటీ మొబిలైజర్ చిత్తారి సోమన్న ఉమామహేశ్వరి,హిమ బిందు,పవన్,బోల్లు మురళీ.కోడి అరుణ్ ‌.తథీతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -