Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై రమేష్ బాబు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై రమేష్ బాబు

- Advertisement -

5 అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు సీజ్!
ఏడుగురిపై కేసు నమోదు
నవతెలంగాణ – నెల్లికుదురు 

అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుకను ఆక్రమ రవాణా చేస్తే సహించేది లేదని నెల్లికుదురు ఎస్ఐ చివర రమేష్ బాబు ఆక్రమ రవాణా దారులను హెచ్చరించినట్లు తెలిపారు. గురువారం బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామంలోని ఆఖరి వాగులో ఆక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారు ఆకేరు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు గురువారం సంబంధిత ఏరియాకు పోలీసు సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించగా 5 ఇసుక ట్రాక్టర్లు ఉన్నాయని, వాటిని పట్టుకొని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి, సీజ్ చేసినట్లు తెలిపారు. ఇసుకతో ఉన్న ట్రాక్టర్లను మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు కు అప్పగిస్తామన్నారు. మరో 5 ఎం టి ట్రాక్టర్లను సైతం పట్టుకున్నామని చెప్పారు.

అక్రమ రవాణాకు పాల్పడిన ట్రాక్టర్ డ్రైవరు మరియు ఓనర్ అయిన ఏడుగురు జలక ఉమేష్, పెరుమాండ్ల సంజీవ, పట్కాల యాకన్న, పెరుమండ్ల కిరణ్, భూక్యా రమేష్, దాసరి వీరయ్య, జల్ల ప్రవీణ్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -