Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా..

ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా..

- Advertisement -

ఆశీర్వదించి గెలిపించండి.. బిఆర్ఎస్ అభ్యర్థి సాతాని శ్రీశైలం 
నవతెలంగాణ-సదాశివపేట
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనని ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సాతాని శ్రీశైలం తెలిపారు. గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. వార్డు ప్రజలు ఈ విషయాన్ని గమనించి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వార్డు ఇంచార్జి అనిల్ రెడ్డి , కార్యకర్తలు, మహిళలు,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -