Friday, February 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేటి పరిస్థితులకు ప్రతిబింబం

నేటి పరిస్థితులకు ప్రతిబింబం

- Advertisement -

భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, విఘ్నేశ్‌ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నేడు (శుక్రవారం) విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ అత్యంత వైభవంగా నిర్వహించారు. డైరెక్టర్‌ గుణ శేఖర్‌ మాట్లాడుతూ,’1992లో ‘లాఠీ’ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇది నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్‌ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్‌తో ఉన్నాను. ఓ మంచి కథను, కొత్త కథను మరింత కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాను. నేను ప్రేక్షకుల దేవుళ్లని నమ్ముతాను. నేను వారి టైంకి, డబ్బుకి, విజ్ఞతకి విలువ ఇస్తాను. నేను వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ మూవీని తెరకెక్కించాను. నేను ప్రేక్షకుల డబ్బుని, సమయాన్ని వృథా చేయను. ప్రేక్షకుల విజ్ఞతకి పెద్ద పీఠ వేసేలా ఈ మూవీని రూపొందించాను.

ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. సినిమా చూసిన వారంతా కూడా ‘ఏంటండి.. అంత డబ్బులు పెట్టేశారు.. ఇలాంటి కథను ఇంత గొప్పగా, ఇంత భారీ బడ్జెట్‌తో, కొత్త వారితో చేయడం అంటే మామూలు విషయం కాదు’ అని అన్నారు. ఇదొక ఫ్యామిలీ ప్రొడక్ట్‌లా తీశారని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ కథకు సారా అర్జున్‌ ఆత్మ. ఆమె ఒప్పుకుంటేనే మూవీ తీయాలని అనుకున్నాను. సినిమా చూశాక ఆ విషయం ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. ఈ సినిమాకి భూమిక బ్యాక్‌ బోన్‌. ఆమె చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. వింధ్య వేములపల్లి పాత్రలో ఆమె జీవించారు. విఘ్నేశ్‌ ఈ సినిమాకి బ్రెయిన్‌ లాంటివాడు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ మూవీ ఉందని చూసిన వారంతా ప్రశంసించారు. పృథ్వీ సైతం పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించాడు. స్పాయిల్‌ కిడ్స్‌ని చూపించేలా రూపొందించిన పాత్రలో లిఖిత గొప్పగా నటించారు. అడాల్‌సెన్స్‌, పేరెంటింగ్‌, సోషల్‌ ఇంపాక్ట్‌ అనే అంశాలతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. నా మేధస్సుని ఉపయోగించి కాకుండా ఓ సాధారణ వ్యక్తిలా, సమాజాన్ని చూసిన వ్యక్తిగా ఈ మూవీని తీశాను.

తెలుగు టైటిల్‌ పెట్టనందుకు నన్ను క్షమించండి. సినిమా చూసిన తరువాత ‘యుఫోరియా’ టైటిల్‌ కరెక్ట్‌గా సెట్‌ అయిందని అంటారంతా. సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లుకున్నాను. ప్రవీణ్‌ కెమెరా వర్క్‌ చాలా కొత్తగా ఉంటుంది. కాలభైరవ బీజీఎం అదిరిపోతుంది. తండ్రికి తగ్గ తనయుడు అని కాలభైరవ నిరూపించుకుంటాడు. మేం కుటుంబ సమేతంగా ఈ మూవీని నిర్మించాం. ఈ చిత్రాన్ని యూత్‌, పేరెంట్స్‌ ఇలా అందరూ వీక్షిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఇలాంటి చిత్రాలను చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి చిత్రాల్లో రిస్క్‌ ఎంతో ఉంటుంది. కానీ గుణశేఖర్‌, ఆయన ఫ్యామిలీ కలిసి రిస్క్‌ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఈ మూవీని చూశాను. సినిమా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. రాత్రంతా ఈ మూవీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్‌ చేయండి’ అని భూమిక చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -