Friday, February 6, 2026
E-PAPER
Homeఆటలుఒమన్‌తో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌!

ఒమన్‌తో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌!

- Advertisement -

ఆ దేశ రాయబారితో జితేందర్‌ రెడ్డి ప్రతిపాదన

న్యూఢిల్లీ : తెలంగాణ, ఒమన్‌ సాంస్కృతిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించాలని ఒమన్‌ రాయబారి ఇస్సా సలేహ్‌ అల్‌ షిబానితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం న్యూఢిల్లీలోని ఒమన్‌ రాయబార కార్యాలయంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌లో ఒమన్‌, తెలంగాణ స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ నిర్వహించాలని ఏపీ జితేందర్‌ రెడ్డి ప్రతిపాదించగా, ఒమన్‌ రాయబారి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఒమన్‌లో తెలంగాణ వలస కార్మికుల సంక్షేమం, తెలంగాణ నుంచి గ్రానైట్‌, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌ ఉపకరణాలను ఒమన్‌కు ఎగుమతి చేయటంపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -