నవతెలంగాణ – ఖమ్మం రూరల్
పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తమ్మినేని కోటేశ్వరావును సీపీఐ(ఎం) నుంచి బహిష్కరిస్తున్నట్టు ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోటేశ్వరరావు చర్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని, ఆయా సందర్భాల్లో అంతర్గతంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ఆయన పొరపాట్లను సరిదిద్దటానికి అనేక ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయిందని తెలిపారు.
తాజాగా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై, పార్టీ నిర్ణయానికి భిన్నంగా తన భార్యను పోటీ నుంచి ఉపసంహరింపజేయించారని ఆరోపించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన తమ్మినేని కృష్ణయ్య భార్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించారని తెలిపారు. తెల్దారుపల్లిలో మిగతా ఇద్దరు పార్టీ అభ్యర్థులను కూడా ఉపసంహరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఐ(ఎం) నుంచి తమ్మినేని కోటేశ్వరరావు బహిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



