Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రూప్‌ 1 నియామకాలపై పోరాడి విజయం సాధించాం

గ్రూప్‌ 1 నియామకాలపై పోరాడి విజయం సాధించాం

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌ 1 నియామకాలపై న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించుకున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం గ్రూప్‌ -1 నియామకాలపై హైకోర్టు తీర్పును హదయపూర్వకంగా స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన ట్వీట్‌ చేశారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్‌-1 అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్‌ -1 అధికారులుగా నియమితులైన వారు రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -