Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కులను పరిరక్షించాలి

ఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కులను పరిరక్షించాలి

- Advertisement -

ఫిబ్రవరి 12 సమ్మెలో పాల్గొందాం : ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ పిలుపు
కరపత్రాల ఆవిష్కరణ.. కార్మికులకు పంపిణీ


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలపై ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సమరభేరి మోగించాయి. పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. విద్యుత్‌ చట్ట సవరణ- 2025ను ఉపసంహరించాలని కోరాయి. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి.

పది జాతీయ కార్మిక సంఘాలు, అసోసియేషన్ల పిలుపు మేరకు ఈనెల 12న జరుగనున్న ఒక్కరోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి, ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.రావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఆర్టీసీ బస్‌భవన్‌ మెయిన్‌గేట్‌ వద్ద సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వాటిని కార్మికులకు పంచారు. ఈనెల 12న జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -