Friday, February 6, 2026
E-PAPER
Homeఆటలుబాయ్ కాట్‌పై పునరాలోచన చేయండి

బాయ్ కాట్‌పై పునరాలోచన చేయండి

- Advertisement -

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఎస్‌ఎల్‌సీ లేఖ

కొలంబో : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో భారత్‌తో మ్యాచ్‌ బాయ్ కాట్‌ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ని శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) కోరింది. ఈ మేరకు గురువారం పీసీబికి ఎస్‌ఎల్‌సీ ఓ లేఖ రాసింది. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఆతిథ్యానికి శ్రీలంక ఆసక్తిగా ఎదురుచూస్తుందని, బాయ్ కాట్‌ నిర్ణయం ఆర్థికంగా పెను భారంగా మారటంతో పాటు పర్యాటకం, లాజిస్టికల్‌గా ఆతిథ్య దేశం శ్రీలంకపై గణనీయంగా పడుతుందని ఎస్‌ఎల్‌సీ లేఖలో ప్రస్తావించింది.

బాయ్ కాట్‌తో జరిగే ఆర్థిక నష్టంతో అందరికీ ఇబ్బందులు వస్తాయని ఎస్‌ఎల్‌సీ హెచ్చరించింది. 2009 లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్ల బస్‌పై ఉగ్రదాడి జరిగినా..పాక్‌లో క్రికెట్‌ పునరుద్ధరణకు సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌సీ లేఖలో గుర్తు చేసింది. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నెల 7 నుంచి పొట్టి ప్రపంచకప్‌ షురూ కానుండగా, 20 జట్లు పోటీపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -