Friday, February 6, 2026
E-PAPER
Homeబీజినెస్ఇండియన్‌ ఆయిల్‌ లాభాలు 515 శాతం వృద్ధి

ఇండియన్‌ ఆయిల్‌ లాభాలు 515 శాతం వృద్ధి

- Advertisement -

న్యూఢిల్లీ : చమురు రంగ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బంపర్‌ లాభాలను సాధించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చౌక చమురు ధరలు ఆ కంపెనీకి భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 515 శాతం వృద్ధితో రూ.13,006 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. ఇంతక్రితం 2024-25 ఇదే క్యూ3లో రూ.2,115 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇదే సమయంలో రూ.2,19,522 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ3లో 7.6 శాతం పెరిగి రూ.2,36,257 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 9 శాతం పడిపోవడం కంపెనీ భారీ లాభాలకు దోహదం చేశాయి. గురువారం బీఎస్‌ఈలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్‌ 1.74 శాతం పెరిగి రూ.175.75 వద్ద ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -