Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగొర్రెల మందపై కుక్కల దాడి

గొర్రెల మందపై కుక్కల దాడి

- Advertisement -

30 గొర్రె, మేక పిల్లలు మృత్యువాత

నవతెలంగాణ-కొండపాక
గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రె, మేక పిల్లలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలోని మర్పడ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. మర్పడ గ్రామానికి చెందిన పిండి నారాయణ మేకలు, గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగా కొట్టంలోని పిల్లలకు మేత పెట్టి గొర్రెల, మేకలను అడవికి తోలుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఆయన కుమారుడు స్వామి ఇంటికి వచ్చి చూసేసరికి గొర్రెల కొట్టంలో నుంచి కుక్కలు బయటకు వస్తూ కనిపించాయి. వెంటనే అక్కడికెళ్లి చూసేసరికి సుమారు 30 గొర్రెల, మేకల పిల్లలు మృత్యువాతపడ్డాయి. వాటిని చూసి కుటుంబంలో కన్నీటి పర్యంతమవుతోంది. వాటి విలువ సుమారు రూ.1,50,000 వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవాలపై ఆధారపడి బతికే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -