Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించండి

ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించండి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధార్థ కోరారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక 15వ వార్డులో ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. అనంతరం ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గత పాలకవర్గం పట్టణాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు.

తాను గతంలో చేసిన అభివృద్ధి తప్ప పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పట్టణంలోని సమస్యలపై మాట్లాడకపోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొన్నిచోట్ల అభ్యర్థులను బెదిరిస్తున్నారని, అలా చేయటం వల్ల ఓట్లు వచ్చే పరిస్థితి లేదని బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు అరుణ కౌసల్య మంగారెడ్డి, మట్టారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -