Friday, February 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్... యువకుడు మృతి

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్… యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-కాటారం: కాటారం మండలం బస్వాపూర్ టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పిట్టల జస్వంత్ (20) అనే యువకుడు మృతి చెందాడు. అదే ద్విచక్ర వాహనంపై ఉన్న ఇండ్ల విజయ్ (24) తీవ్రమైన గాయలై రోడ్డుపై పడిపోగా గమనించిన స్థానికులు యువకున్ని భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -