Friday, February 6, 2026
E-PAPER
Homeకరీంనగర్మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: ఎమ్మెల్యే

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
మండలంలోని ఆలూరు, రాజనగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా, వైద్య రంగాలతో పాటు మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మ, ఏపీఎం నరహరి, పి.ఆర్ ఏఈ సివి ప్రసాద్, సర్పంచులు నల్లాల స్వామి, భారతపు రాజేష్, ఉప సర్పంచులు సల్ల మహేష్, శ్రీనివాస్, మండల నాయకులు రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్, మోర హనుమాండ్లు, గన్నెరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -