Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన 

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని అజ్జాలపురం అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాసనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ సక్కుబాయి,ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద చిన్నపిల్లల తల్లులకు,గర్భిణీ స్త్రీలకు పోషకాహారం , ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగింది. గ్రామ సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామంలో అంగన్వాడి సేవలను,మరియు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారమును ప్రతి ఒక్క తల్లి,బిడ్డ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రంలో ఉప సర్పంచ్ శ్రీలత శ్రీధర్,పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి,అంగన్వాడి టీచర్ శోభ,జయమ్మ,ఆయా వెంకటమ్మ,గర్భిణీ స్త్రీలు,బాలింతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -