మంత్రి శ్రీధర్ బాబుకు,కలెక్టర్ లకు కృతజ్ఞతలు ప్రిన్స్ పల్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మెయిన్ గేట్ నుండి కళాశాల భవనం 160 మీటర్ల వరకు రూ.12 లక్షల సిబిఏప్, పంచాయతీరాజ్ నిధులతో సిసి రోడ్డు పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ప్రారంభించారు. అడుగగానే సిసి రోడ్డు నిర్మాణం మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి ఐటి, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మలకు కళాశాల ప్రిన్ పాల్ విజయదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనులు చేపట్టే గుత్తేదారు పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సర్పంచ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఇందారపు సారయ్య,అధ్యాపకులు, అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తాడిచెర్ల కళాశాలలో సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



