Friday, February 6, 2026
E-PAPER
Homeకరీంనగర్స్వేచ్ఛగా ఓటింగ్ లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

స్వేచ్ఛగా ఓటింగ్ లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్  పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు ముందురోజు, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాన్ని నిశితంగా పరిశీలించాలని, ఎన్నికలు జరిగిన తీరును పర్యవేక్షించి, అట్టి నివేదికను ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ సరళినీ, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, వారి విధులను పటిష్టంగా నిర్వహిస్తునే పోలింగ్ టీంలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎన్నికల నియమావళి అమలు, తదితర విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారి మల్లిఖార్జున రావు, ట్రైనర్ మహేందర్ రెడ్డి, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -